Site icon NTV Telugu

Diwali: శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..

Diwali

Diwali

Diwali: దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ‘‘దీపావళి’’ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దీపావళికి సంబంధించి కొత్త బట్టలు, టపాసులు, ఇతరత్రా షాపింగ్ జోరుగా సాగుతోంది. తమ కుటుంబాలతో ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్‌పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో వందల ఏళ్లుగా పండగను జరుపుకోవడం లేదు. దీనంతటికి ఓ ‘‘సతి’’ శాపమే కారణం. ఒక మహిళన తన భర్త చితిలో దూకి నిప్పటించుకుని మరణిస్తూ, శపించినప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రజలు దీపావళిని జరుపుకోవడం లేదు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న సమ్మూలోని చిన్నగా దీపాలను వెలిగించవచ్చు, కానీ పటాకులు కాల్చడం, పండగ చేసుకోవడంపై నిషేధం ఉంది.

Read Also: Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?

కట్టుబాటును కాదని ఎవరైనా పండగ జరుపుకునేందుకు ప్రయత్నించిన సమయంలో, గ్రామంలో ఏదో ఒక చెడు జరగడం, ఎవరో ఒకరు చనిపోవడం వంటివి జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ శాపం తొలగడం కోసం అనేక పూజలు, హవనాలు, యజ్ఞాలు చేశారు. 3 ఏళ్ల క్రితం పెద్దగా యజ్ఞం కూడా చేశారు.అయినా కూడా శాపం ఎఫెక్ట్ ఇంకా ఉంది అని గ్రామస్తులు చెబుతునున్నారు. పండగ రోజు కొందరు ఇళ్ల నుంచి కూడా బయటకు రారు.

శాపం ఎలా వచ్చింది..?

గ్రామస్తుల ప్రకారం, వందల ఏళ్ల క్రితం, ఒక గర్భిణీ స్త్రీ దీపావళి జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, స్థానిక రాజు సైన్యంలో ఉన్న ఆమె భర్త చనిపోయి, అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. భర్త మరణంతో తీవ్ర బాధలో ఉన్న ఆమె, భర్త చితిలో దూకి మరణించింది. ఆమె చనిపోయే ముందు, ఒక శాపాన్ని పెట్టింది. గ్రామ ప్రజలు ఎప్పటికీ దీపావళి జరుపుకోరని శపించింది. వారు ఆ రోజు జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఎవరైనా చనిపోతారు లేదా గ్రామంలో ఏదైనా విపత్తు సంభవిస్తుందని ఆ గ్రామంలో వృద్ధడైన ఠాకూర్ బిధి చంద్ అన్నారు.

Exit mobile version