NTV Telugu Site icon

Hathras Stampede Tragedy: సుప్రీంకోర్టుకు హత్రాస్ తొక్కిసలాట విషాదం.. శుక్రవారం విచారణ..!

Sc

Sc

Hathras Stampede Tragedy: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలను కొల్పోయారు. ఈ ప్రస్తుం సుప్రీంకోర్టుకు చేసింది. తొక్కిసలాట దుర్ఘటనపై రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్‌ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే, ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును సమర్పించాలని.. బాధ్యులుగా తేలిన అధికారులతో సహా మిగతా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. కాగా, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిటిషన్‌ను జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారిస్తామని పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: హిందుత్వ హింసపై వివాదం.. రాహుల్కు మద్దతుగా జ్యోతిర్ మఠం శంకరాచార్య..!

అయితే, ‘భోలే బాబా’ సత్సంగంలో తొక్కిసలాట జరగడానికి రద్దీ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని ఈ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా జోన్) అనుపమ్ కులశ్రేష్ఠ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ చైత్ర వితో కూడిన సిట్ ఈరోజు తన నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సమర్పించింది. కానీ, ‘సత్సంగ్’ నిర్వాహకులు 80,000 మంది సమావేశానికి అనుమతి కోరారు.. అయితే 2.5 లక్షల మంది అనుచరులు వచ్చారు.. దీంతో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు.