Hathras stampede: ప్రజలపై విషం చల్లారు.. తొక్కిసలాట ఘటనపై భోలే బాబా లాయర్..
- హత్రాస్ ఘటనపై భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు..
- విషం చల్లడంతోనే తొక్కిసలాట..
- 15-16 మంది కుట్ర పన్నడంతోనే ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras stampede: హత్రాస్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక ధార్మిక కార్యక్రమంతో కోసం ఎక్కువ సంఖ్యలో జనం హాజరుకావడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భోలే బాబాగా పిలువడే ఆధ్యాత్మిక గురువు కార్యక్రమానికి లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. 80 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది ప్రజలు వచ్చారు. భోలే బాబా పాదధూళి తీసుకునేందుకు జనాలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: BMW Car Accident: బీఎండబ్ల్యూ కార్ ఢీకొని మహిళ మృతి.. శివసేన నేత కుమారుడే ప్రధాన నిందితుడు..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఇదిలా ఉంటే ఈ ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని భోలే బాబా ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత మరోసారి భోలే బాబా తరుపున ఆయన న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ తొక్కిసలాట పథకం ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. మతమరమైన కార్యక్రమంలో 10-12 మంది వ్యక్తులు విషం చల్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని న్యాయవాది ఏపీ సింగ్ ఆదివారం పేర్కొన్నారు. తొక్కిసలాట తర్వాత కుట్ర చేసినవారు అక్కడ నుంచి పారిపోయారని అన్నారు.
ఈ కుట్రలో మొత్తం 16 మంది పాల్గొన్నారని, కొన్ని గుర్తుతెలియని వాహనాలు తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో ఉన్నాయని, 10-12 మంది విషం చిమ్మడంతో మహిళలు ఊపిరితీసుకునేందుకు పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న దేవప్రకాష్ మధుకర్‌ని గత వారం సిట్ ముందు లొంగిపోయాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ (రిటైర్డ్) బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు మధుకర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!