Hate Speech Bill: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫాంల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగం (హేట్ స్పీచ్ ) చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 3 జైలు శిక్ష, రూ. 5 వేలు ఫైన్ విధించేలా చట్టం తీసుకొస్తుంది. కర్ణాటక హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లు 2025 పేరిట ముసాయిదా చట్టంలో కీలక నిబంధనలను రూపొందించారు. ఇందులో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కట్టుదిట్టమైన నియంత్రణతో పాటు జిల్లా స్థాయి అధికారులకు వాటిని నిరోధించే హక్కులను ఇచ్చారు. ఈ బిల్లులో ద్వేషపూరిత ప్రసంగాలకు బెయిల్ లేకుండా కేసు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Read Also: BCCI-IPL: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బీసీసీఐ కీలక నిర్ణయం!
అయితే, సోషల్ మీడియా సంస్థలు, టెలికం కంపెనీలు, ఆన్‌లైన్ మార్కెట్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ అకౌంట్లలో రెచ్చగొట్టే కంటెంట్ ని ప్రసారం చేస్తే.. మూడేళ్ల జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉంది. హేట్ స్పీచ్ లేదా హేట్ క్రైమ్స్‌కు ఆర్థిక సాయం, ఇతర సహాయం చేసిన వారిని కూడా ప్రధాన దోషులుగా శిక్షించనున్నట్లు ముసాయిదా బిల్లులో చేర్చారు. మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు ర్యాలీలు, బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటి కార్యకలాపాలను 30 రోజుల పాటు నిషేధించగలిగే అధికారం కట్టబెట్టింది. అవసరమైతే ఈ ఆదేశాలను 60 రోజులకు పొడిగించే అవకాశం ఉందన్నారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ పొందవచ్చని ఆ బిల్లులో వెల్లడించింది.
Read Also: Minister Narayana: భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు.. 12 అంశాలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం..!
ఇక, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం కర్ణాటక ప్రభుత్వ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రచారాలు నిర్వహించాలని మూసాయిదా బిల్లులో తెలిపారు. ఈ బాధ్యతలు మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ లాంటి సంస్థలకు అప్పగించే ఛాన్స్ ఉంది. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణతో పాటు చట్ట అమలుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం రాష్ట్ర సర్కార్ కి ఇవ్వనుంది. ఈ చట్టం అమలైతే విద్వేషాలు వ్యాప్తి చేసే విషయంలో డిజిటల్ మీడియాను కర్ణాటక ప్రభుత్వం కట్టడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
