NTV Telugu Site icon

Viral Video: మేనకోడలు పెళ్లి.. కట్టలు కట్టలుగా డబ్బుల కుప్ప.. వీడియో వైరల్

Haryana Man

Haryana Man

Haryana: తన మేనకోడలు పెళ్లిలో ఓ వ్యక్తి కనకవర్షం కురిపించాడు. వివాహ వేడుకులో కట్టలు కట్టలుగా డబ్బులు కుప్ప పోసి అతిథులందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంత అతడి గురించే చెర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరూ.. అంత డబ్బు ఎక్కడితే అంటూ ఆరా తీస్తున్నారు. వివరాలు.. హర్యానాలోని రేవారీ నగరానికి చెందిన అసల్వాస్ సత్బీర్ సోదరి తన కూతురికి వివాహం జరిపించింది. ఆమెకు భర్త లేడు. దీంతో మేనమామగా మేనకోడలికి పెళ్లికి కట్నకానుకలు సమర్పించాడు.

Also Read: Crime News: 79 ఏళ్ల వృద్ధురాలి మృతదేహంతో శృంగారంలో పాల్గొన్న సెక్యూరిటీ గార్డ్

ఈ క్రమంలో వివాహ వేడుకలో భాగంగా పెళ్లి తంతు ముందు పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన కుటుంబంతో పాటు గ్రామ ప్రజలతో కలిసి సత్బీర్ హాజరయ్యారు. సాయంత్రం పెళ్లి వేడుక ప్రారంభం కాగానే సత్బీర్ తన సోదరి ఇంట్లో రూ.500 నోట్ల గుట్టను పేర్చటం చూసి వారంతా షాక్ అయ్యారు. అంతా డబ్బా అంటూ నోళ్లు వెల్లబెట్టారు. తన మేనకోడలికి సంప్రదాయం ప్రకారం కట్నకానులకు బహుకరించారు. ఇందుకోసం ఏకంగా ఒక కోటి, ఒక లక్ష, 11 వేల 101 రూపాయల నగదుతో పాటు మరో కోటి రూపాలయ నగలను బహుమతిగా ఇచ్చాడు.