NTV Telugu Site icon

Haryana: ఈనెల 17న హర్యానా సీఎంగా సైనీ ప్రమాణం.. ప్రధాని మోడీ హాజరు

Pmmodi

Pmmodi

హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణస్వీకారం చేయనున్నారు. పంచకులలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.

ఇటీవల విడుదలైన హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఊహించని రీతిలో కమలం పార్టీ విజయం సాధించింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ 37 స్థానాలకే పరిమితమైంది. ఇక స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి సపోర్టు చేయడంతో బలం పెరిగింది.

ఇది కూడా చదవండి: Allahabad HC: భార్య భర్త లైంగిక కోరికలు తీర్చకుంటే.. అతను ఎక్కడికి వెళతాడు..?

అక్టోబరు 17న పంచకులలో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్‌ సైనీ, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సైనీతో సహా గరిష్టంగా 14 మంది మంత్రులు ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: DMart Q2 Results: డీమార్ట్‌కు భారీ లాభాలు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..!

అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 200 రోజుల ముందు సైనీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు దిగి బీజేపీ విజయం సాధించింది. దాదాపుగా అన్ని రకాల ప్రజల ఓట్లను రాబట్టుకున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంవత్సరాలుగా పేరుకుపోయిన అధికార వ్యతిరేకతను తిప్పికొడుతూ, వ్యాపారులు, యువకులు, వెనుకబడిన తరగతులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే పథకాలను సైనీ అమలు చేశారని కొందరు రాష్ట్ర నాయకులు అంటారు. ఈ కారణం చేతనే బీజేపీ గెలిచింది. గతంలో హర్యానాలో మూడు సార్లు అధికారంలోకి వచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అది బీజేపీ మాత్రమే సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి: RSS Chief: ‘‘డీప్ స్టేట్, గాజా, బంగ్లాదేశ్, హమాస్’’.. దసరా స్పీచ్‌లో మోహన్ భగవత్ కీలక కామెంట్స్..