NTV Telugu Site icon

Haryana Polls: లాడ్వాలో ముఖ్యమంత్రి సైనీ నామినేషన్.. హాజరైన కేంద్రమంత్రి ఖట్టర్

Haryanacmnayabsinghsaini

Haryanacmnayabsinghsaini

హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. లాడ్వా నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. మంగళవారం పార్టీ ఆఫీసులో పూజ నిర్వహించి.. అనంతరం ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి సైనీ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు. నామినేషన్ వేసినప్పుడు ముఖ్యమంత్రి సైనీ వెంట కేంద్రమంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

నామినేషన్ అనంతరం సైనీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సెప్టెంబర్ 14న ఎన్నికల ప్రచారం కోసం హర్యానా వస్తున్నట్లు తెలిపారు. మరోసారి అధికారంపై ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇదిలా బీజేపీ ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను ప్రకటించగా.. మంగళవారం రెండో జాబితాలో 21 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును విడుదల చేసింది. మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది. ఇంకా రెండు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Stock market: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల జోరు

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య పోటీ నెలకొంది. ఆప్-కాంగ్రెస్ మధ్య పొత్తు చెడిపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండేసి జాబితాలను విడుదల చేశాయి.