LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన..
- దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదు..
- పార్లమెంట్లో కేంద్రమంత్రి ప్రకటన..
- గృహ వినియోగదారులకే తొలి ప్రాధాన్యం..
- గ్యాస్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు ఎలాంటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కమర్షియల్ గ్యాస్‌ను బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ముందుగా సాధారణ ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. స్కూల్స్, హాస్పిటల్స్‌కు ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే చమురు విషయంలో భారత్ స్థానం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.
Read Also: Sprouts Chilla Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో “మొలకల చిల్లా” చేసుకోండి.. రుచితో పాటు ఆరోగ్యం..
Also Read
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
గల్ఫ్ దేశాల నుంచి 60 శాతం ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నామని, దేశంలో డిజిల్, పెట్రోల్ కొరత లేదని చెప్పారు .గల్ఫ్ దేశాలకు బదులుగా నార్వే, కెనడా నుంచి దిగుమతి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలోని అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంలో పని చేస్తున్నాయని చెప్పారు. హార్ముజ్ జలసంధి నుంచి కాకుండా వేరే ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతులు దాదాపుగా 70 శాతానికి పెరిగాయని వెల్లడించారు. భారతదేశం చమురు అవసరాల కోసం 2006-07లో 27 దేశాలపై ఆధారపడితే, ఇప్పుడు ఇది 40 దేశాలకు పెరిగిందని కేంద్రమంత్రి చెప్పారు.
ఆధునిక ఇంధన చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని, భారతదేశ ముడి చమురు స్థానం సురక్షితంగా ఉందని, సంక్షోభానికి ముందు భారత ముడి చమురు దిగుమతుల్లో 45 శాతం మాత్రమే హార్ముజ్ ద్వారా రవాణా జరిగిందని, సంక్షోభ సమయంలో కూడా ప్రధాని మోడీ దౌత్యం వల్ల భారతదేశానికి హర్ముజ్ జలసంధిని ఇరాన్ అనుమతించిందని సభలో తెలిపారు.
#WATCH | Delhi: In the Lok Sabha, Union Minister for Petroleum and Natural Gas, Hardeep Singh Puri, says, "The refineries are operating at high capacity utilisation. In several cases, they are exceeding 100%. There is no shortage of petrol, diesel, kerosene, ATF or fuel oil. The… pic.twitter.com/bqZWqcDf8G
— ANI (@ANI) March 12, 2026
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!