NTV Telugu Site icon

West Bengal: బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్.. “సందేశ్‌ఖాలీ” నిందితుడిని సీబీఐకి అప్పగించాలని ఆదేశం..

West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక ఆరోపణలు, భూకబ్జా, రేషన్ బియ్యం కుంభకోణాలనికి పాల్పడినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్‌కి సంబంధించిన మెటీరియల్‌ సీబీఐకి అందించడానికి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగాల్ పోలీసులకు గడువు విధించింది.

అయితే, బెంగాల్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి వేగంగా సిద్ధమైంది.కాగా, ఈ అప్పీల్ తిరస్కరించబడింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, రిజిస్ట్రార్ జనరల్ ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరింది. సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం పక్కనపెట్టి, కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేసింది. ఈ షేక్ షాజహాన్ కేసును సీబీఐకి అప్పగించాలని ఈడీ కోరగా.. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Read Also: Heart Health: మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఇవి తినండి..

రేషన్ బియ్యం కుంభకోణంలో షేక్ షాజహాన్ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు దర్యాప్తుకు వెళ్లిన సమయంలో అతని అనుచరులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అప్పటి నుంచి సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలు, అక్కడి ప్రజలు తృణమూల్ గుండాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపుగా 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్‌ని కాపాడుతోందని బీజేపీ విమర్శి్స్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది.

Show comments