Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్ కూడా మరణించారు. ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల జాయింట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లిన రైసీ, తిరిగి వస్తున్న క్రమంలో హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. హెలికాప్టర్ కూలడానికి విపరీత వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది.
Read Also: Thummala Nageswara Rao: సోనియా గాంధీ, ఖర్గే ఎంపిక చేసిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఇదిలా ఉంటే, బుధవారం ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు జరిగాయి. ఇరాన్ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా హాజరై రైసీకి నివాళులు అర్పించారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షడు మహ్మద్ ముఖ్‌బన్‌ని కలుసుకుని సంతాపం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే రైసీ అంత్యక్రియలకు హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిటిటెంట్ సంస్థల లీడర్లతో పాటు తాలిబాన్ లీడర్లు హాజరయ్యారు. టెహ్రాన్‌లో జరిగిన ఈ అంత్యక్రియాలకు తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా బరాదర్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా ఇరాన్ ప్రజలు హాజరైన ప్రార్థనలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహించారు.
- Tags
- Ebrahim Raisi
- Hamas
- Houthi
- Iran
- Taliban
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!