NTV Telugu Site icon

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..

Ebrahim Raisi

Ebrahim Raisi

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్‌ కూడా మరణించారు. ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల జాయింట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లిన రైసీ, తిరిగి వస్తున్న క్రమంలో హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. హెలికాప్టర్ కూలడానికి విపరీత వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది.

Read Also: Thummala Nageswara Rao: సోనియా గాంధీ, ఖర్గే ఎంపిక చేసిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న

ఇదిలా ఉంటే, బుధవారం ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు జరిగాయి. ఇరాన్ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా హాజరై రైసీకి నివాళులు అర్పించారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షడు మహ్మద్ ముఖ్‌బన్‌‌ని కలుసుకుని సంతాపం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే రైసీ అంత్యక్రియలకు హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిటిటెంట్ సంస్థల లీడర్లతో పాటు తాలిబాన్ లీడర్లు హాజరయ్యారు. టెహ్రాన్‌లో జరిగిన ఈ అంత్యక్రియాలకు తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా బరాదర్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా ఇరాన్ ప్రజలు హాజరైన ప్రార్థనలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహించారు.