NTV Telugu Site icon

Rahul Gandhi: వారణాసి నుంచి ప్రియాంకా పోటీ చేసి ఉంటే, మోడీ ఓడిపోయేవారు..

Rahul, Priyanka

Rahul, Priyanka

Rahul Gandhi: తన సోదరి ప్రియాంకాగాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్రమోడీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించేవారని మంగళవారం రాహుల్ గాంధీ అన్నారు. వారణాసి నుంచి 2014 నుంచి మోడీ పోటీ చేస్తున్నారు, 2014, 2019తో పోలిస్తే 2024లో గెలుపు మార్జిన్ తక్కువగా ఉంది. ఇటీవల రాయ్‌బరేలీ నుంచి మూడు లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ, ఈ రోజు అక్కడి నుంచి మాట్లాడుతూ మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Yuva Rajkumar: భార్యకు అక్రమ సంబంధం.. రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరో సంచలనం!

తాను అహంకారంతో ఈ మాట చెప్పడం లేదని, మోడీ రాజకీయాలు తమకు నచ్చడం లేదని భారత ప్రజలు ఆయనకు సందేశం పంపారని, అందుకు తాను ఈ మాట చెబుతున్నట్లు వెల్లడించారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడుతామనే సందేశాన్ని ప్రజలు పంపారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నప్పటికీ, ఆమె పోటీ నుంచి దూరంగా ఉన్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ వయనాడ్, తన తల్లి సోనియా గాంధీ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ ఆధిక్యతతో గెలిచారు. అమేథీ నుంచి కేఎల్‌ శర్మను కాంగ్రెస్‌ పోటీకి దింపింది, ఇతను బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ దెబ్బతీసింది. గత రెండుసార్లు బీజేపీకి 60+ సీట్లను ఇచ్చిన ఈ రాష్ట్రం 2024లో మాత్రం ఎన్డీయే కూటమికి 36 సీట్లే కట్టబెట్టింది.