NTV Telugu Site icon

H-1B Visa: మోడీ పర్యటన వేళ.. భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పనుందా..?

H 1b Visa

H 1b Visa

H-1B Visa: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. రక్షణ, సాంకేతిక విషయాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మోడీ పర్యటన వేళ.. అమెరికా భారతీయులకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

H-1B వీసాల విషయంలో అక్కడ పనిచేస్తు్న్న భారతీయ నిపుణులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధం అయిందని.. గురువారం దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. H-1B వీసాల రెన్యూవల్ విధానాన్ని సరలీకరించేలా బైడెన్ యంత్రాంగం గురువారం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఇది అమలైతే ఎన్ఆర్ఐలు తమ వీసాలు రెన్యూవల్ చేసుకునేందుకు స్వదేశాలకు వెళ్లకుండా ఒక పైలట్ ప్రోగ్రామ్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దీని కింద కొంత మంది విదేశీయులకు మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఇప్పడు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు సమాచారం.

Read Also: Miss Shetty Mister Polishetty : సినిమాలో అనుష్క తో రొమాంటిక్ సీన్స్ లో నటించబోతున్న నవీన్..?

విదేశీ నిపుణులకు అమెరికా H-1B వీసాలను ఇస్తోంది. ఏటా ఈ రకమైన వీసాలను భారతీయులే అధికంగా ఉపయోగించుకుంటున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో 4,42,000 మంది H-1B వీసా వినియోగదారుల్లో 73 శాతం మంది భారతీయులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. వీసా స్టాంపింగ్ కోసం ఆయా దేశాల్లోని అమెరికన్ కాన్సులేట్/ఎంబీసీల్లో దరఖాస్తు చేసుకోవాలి. H-1B వీసాల రెన్యూవల్, కొత్తగా పొండదానికి ఇంటర్యవూ కోసం ప్రస్తుతం ఎక్కువ రోజుల వెయిటింగ్ పిరయడ్ ఉంటోంది. అత్యవసర సమయాల్లో స్వదేశానికి వెళ్లాంటేనే భయపడే పరిస్థితి ఉంది. వీసా అపాయింట్మెంట్లో జాప్యంపై ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోందని సమాచారం.

Show comments