NTV Telugu Site icon

Gyanvapi Mosque issue: వారణాసి కోర్టు కీలక తీర్పు.. “శివలింగం” కార్బన్ డేటింగ్ తిరస్కరణ

Gyanavapi Mosque

Gyanavapi Mosque

Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వారణాసి కోర్టు. హిందూ పక్షం తరుపు మసీదులోని వాజూఖానాలో బయటపడిన శివలింగానికి శాస్త్రీయ పరిశోధన జరగాలని.. కార్బన్ డేటింగ్ జరిపించాలని కోరుతూ కోర్టును కోరారు. అయితే శుక్రవారం రోజూ హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి కోర్టు తిరస్కరించింది. హిందూ సంఘాల తరుపున వాదిస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

గతంలో కోర్టు అనుమతితో మసీదులో చేపట్టిన వీడియో సర్వేలో వాజూఖనాలో శివలింగం వంటి ఆకారంలో నిర్మాణం కనిపించింది. ఇది శివలింగమే అంటూ హిందువులు భావిస్తుంటే.. ముస్లిం సంఘాలు మాత్రం ఇది ఫౌంటేన్ అని తెలిపాయి. దీంతో శివలింగం అసలు ఏ కాలానిదో అని తెలుసుకునేందుకు హిందూ సంఘాల తరుపున వాదిస్తున్న లాయర్ దానిపై శాస్త్రీయ పరిశోధనలు జరగాలని అందుకు ఆదేశాలు ఇవ్వాలని సెప్టెంబర్ 22న వారణాసి జిల్లా కోర్టును కోరారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు వాదనలు జరిగాయి. ముస్లిం సంఘాలు శివలింగానికి కార్బన్ డేటింగ్ ను వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు కోర్టు కూడా హిందూ సంఘాల అభ్యర్థనను తిరస్కరించింది.

కార్బన్ డేటింగ్ వంటి సర్వే గతంలో మసీదులోని శివలింగం ఉన్న ప్రాంతాన్ని సీల్ చేస్తూ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లు అవుతుందని.. అందుకనే కార్బన్ డేటింగ్ వంటి సర్వేలను తిరస్కరిస్తున్నట్లు వారణాసి కోర్టు వెల్లడించింది.

Read Also: Husband Shopping With Lover : ప్రియురాలితో షాపింగ్‌కు వెళ్లి భార్యకు చిక్కిన భర్త.. ఇక జాతరే..

మసీదు కూడా కాశీవిశ్వనాథ కాంప్లెక్స్ లో భాగమే అని మసీదు గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీనికి మసీదు కమిటీ వ్యతిరేకించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదులో విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. అయితే గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదులాగే మథురలోని శ్రీకృష్ణ జన్మభూమితో పాటు కర్ణాటకలోని కొన్ని మసీదులు కూడా వివాదాల్లో ఉన్నాయి.