NTV Telugu Site icon

Gyanvapi Mosque case: తదుపరి విచారణ మే30కి వాయిదా

Gyanvapi Mosque

Gyanvapi Mosque

జ్ఞానవాపి మసీదు కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా వారణాసి జిల్లా కోర్ట్ లో ఈ కేసుపై విచారణ జరగుతోంది. తాజాగా ఈ రోజు వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా వేసిన పిటిషన్ ను వారణాసి కోర్ట్ విచారించింది. అయితే కోర్ట్ ముస్లింల తరుపున తదుపరి వాదనలను వినేందుకు మే 30కి విచారణ వాయిదా వేసింది.

అయితే ఇప్పటికే వీడియో సర్వేపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు కోర్ట్ వారం రోజుల గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన వాదనలపై హిందుపక్షాన వాదిస్తున్న విష్ణు జైన్ స్పందించారు. ముస్లిం పక్షం మా పిటిషన్ లోని కొన్ని పేరాగ్రాఫ్ లను చదవి.. ఈ పిటిషన్ ను విచారించడం సాధ్యం కాదని చెప్పడానికి ప్రయత్నించిందని.. అయితే దీనికి మేం ఒప్పుకోలేదని అన్నారు. నేటితో వాదనలు పూర్తి కాలేదని.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత వాదనలు కోనసాగుతాయని ఆయన అన్నారు.

మసీదు వెలుపల పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తమకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేయడంతో వారణాసి సివిల్ కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశించింది. ఈ సర్వేలో మసీదులోని వాజూఖానాలోని కొలనులో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే వీడియో సర్వేను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్ట్ వారణాసి జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేసింది. శివలింగ ఆకారం బయటపడిన ప్రదేశానికి రక్షణ కల్పించాలని.. ఇదే విధంగా ముస్లిం ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.