Hindu Side Moves Plea Seeking Carbon Dating Of ‘Shivalinga’: జ్ఞానవాపి మసీదు కేసులో గురువారం వారణాసి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. హిందూ పక్షం న్యాయవాది విష్ణు జైన్, జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’చేయాలని శివలింగంగా చెబుతున్న ఆకారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
జ్ఞానవాపి శృంగార్ గౌరీ వివాదం కేసులో వారణాసి జిల్లా కోర్టులో జస్టిస్ ఏకే విశ్వేశ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. హిందూ పక్షం శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని పట్టుబట్టింది. అయితే దీనిపై అభిప్రాయాన్ని తెలపాలని న్యాయమూర్తి ముస్లిం పక్షానికి నోటీసులు జారీ చేసి దీనిపై అభ్యంతరాలు ఎమైనా ఉంటే తెలపాలని కోరింది. విచారణను ఎనిమిది వారాల తర్వాత జరపాలన్న డిమాండ్ పై ముస్లిం పక్షం పట్టుబట్టింది. అయితే కోర్టు మాత్రం సెప్టెంబర్ 29కి తరుపరి విచారణను వాయిదా వేసింది.
Read Also: Priyamani: బొడ్డుపై అది ఉండాలని నిర్మాత టార్చర్ చేశాడు..
మేము శివలింగం కార్బన్ డేటింగ్ కోసం డిమాండ్ చేశామని.. ముస్లింపక్షం మాత్రం దీన్ని ఫౌంటైన్ అంటుందని.. నిజాలు వెలికి తీసేందుకు స్వతంత్ర సంస్థ దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని.. అందుకే కార్బన్ డేటింగ్ కోసం పిటిషన్ దాఖలు చేశామని హిందూ పక్షం న్యాయవాది విష్ణు శకంర్ జైన్ తెలిపారు. కార్బన్ డేటింగ్ వల్ల శివలింగంగా చెప్పబడుతున్న ఆకారం వయస్సును కనుక్కునే అవకాశం ఉంది. ఇది మసీదు నిర్మించిన సమయంలో ఉందా.. లేకపోతే అంతకన్నా పురాతనమైందా..? అనేది కార్బన్ డేటింగ్ వల్ల తెలిసే అవకాశం ఉంది.
గత విచారణలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రార్థన స్థలాల చట్టం-1991’ జ్ఞానవాపి మసీదుకు వర్తించదని కీలక తీర్పు వెల్లడించింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు వాదనల్ని కోర్టు తీరస్కరించింది. 1947 ఆగస్టు 15కు ముందు నుంచే ఇది హిందూ దేవాలయం అని చెబుతున్న క్రమంలో ఈ చట్టం వర్తించదని తెలిపింది. ఆ తరువాత మళ్లీ ఈ రోజే వారణాసి కోర్టులో వాదనలు జరిగాయి. జ్ఞానవాపి మసీదులో ఉన్న దేవతా మూర్తులకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టులో కేసు వేయడంతో జ్ఞానవాపి మసీదు వ్యవహారం తెరపైకి వచ్చింది.
