Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- విపక్షాలకు టార్గెట్‌గా సీఈసీ జ్ఞానేష్ కుమార్..
- ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాల విమర్శలు..
- ఐఐటీ నుంచి హార్వర్డ్ వరకు జ్ఞానేష్ కుమార్ విద్యానేపథ్యం..
- ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం ట్రస్ట్ ఏర్పాటలో కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరోసారి ప్రతిపక్షాలకు టార్గెట్‌గా మారారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)విషయంలో మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం తెలిపినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడం సంచలనంగా మారింది. అయితే, ఈ నివేదికను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల సంఘంలో ప్రతీ నిర్ణయం తీసుకునేటప్పుడు లిఖితపూర్వక వ్యాఖ్యలు, విభేదాలు, సూచనలు సమర్పించడం తన సహజమైన, ప్రజాస్వామ్యయుతమైన అంతర్గత ప్రక్రియలో భాగమని పేర్కొంది.
ఐఐటీ నుంచి హార్వర్డ్ వరకు జ్ఞానేష్ కుమార్ విద్యానేపథ్యం..
కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్, 2025 ఫిబ్రవరి 19న దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేవలం ఒక సాధారణ బ్యూరోక్రాట్ మాత్రమే కాదు, అద్భుతమైన విద్యా నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. 1985లో ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ డిగ్రీ పొందారు. ఐసీఎఫ్ఏఐలో బిజినెస్ ఫైనాన్స్ లో చదవారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ సంపాదించారు.
Also Read
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
ఆర్టికల్ 370 నుంచి రామ మందిరం వరకు..
కేరళ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ నుంచి కార్యదర్శి వరకు అనేక పదవుల్లో జ్ఞానేష్ కుమార్ పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో కాశ్మీర్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించిన చారిత్రాత్మక బిల్లు ముసాయిదా రూపకల్పనలో ముఖ్యమైన, వ్యూహాత్మక పాత్ర పోషించారు.
హోం మంత్రిత్వ శాఖలో ఉన్న సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ ఏర్పాటుకు సంబంధించిన చట్టపరమైన, పరిపాలన అంశాలలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సంఘంలో చేరకముందు ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు.
తాజావార్తలు
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!