NTV Telugu Site icon

Guwahati video: సిక్కింలో ప్రమాదం.. పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు

Assamdam

Assamdam

సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్‌పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. ఇది 510 మెగావాట్ల పవర్ స్టేషన్‌. దీన్ని ఆనుకుని కొండచరియలు ఉన్నాయి. గత కొన్ని వారాలుగా తరచుగా చిన్నపాటి రాళ్లు జారిపోతుండడంతో ముప్పు పొంచి ఉందని ముందే అధికారులు గ్రహించారు. మంగళవారం ఉదయం కొండ యొక్క ప్రధాన భాగం జారిపడడంతో విద్యుత్ కేంద్రం శిథిలాలతో ధ్వంసమైంది. ప్రస్తుతం ఇక్కడ పవర్ ఉత్పత్తి జరగడం లేదు. 2023 అక్టోబర్‌లో సిక్కింలో వచ్చిన వరదలు కారణంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ తర్వాత ల్హోనాక్ హిమనదీయ సరస్సు పగిలిపోవడంతో స్టేజ్ 5 ఆనకట్ట పనికిరాకుండా పోయింది.

ఇది కూడా చదవండి: Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొండచరియలు విరిగిపడడంతో ముందుగానే సమీప ప్రాంత వాసులను ఖాళీ చేయించారు. దీంతో ఎవరికీ ఏమీ కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో పని చేస్తున్న కార్మికులు మొబైల్‌లో చిత్రీకరించారు. సిక్కింలో ఉన్న అతిపెద్ద హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు