Site icon NTV Telugu

Gujarat: నవరాత్రి ఉత్సవాలపై రాళ్లదాడి.. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత

Stone Pelting In Gujarat

Stone Pelting In Gujarat

Stone Pelting During Navratri: గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న గర్బా డ్యాన్స్ వేదికపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఖేడా జిల్లాలోని మాటర్ తాలూకాలోని ఉండేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో రాళ్లదాడి జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మరింత ఉద్రిక్తతలు తెలత్తకుండా పోలీసులు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎల్ఎస్బీ, ఎస్ఓజీ సహా పోలీస్ కాన్వాయ్ గ్రామానికి చేరుకుంది. ఈ రాళ్లదాడిలో 6-7 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ, డీఎస్పీతో సహా ఉన్నతాధికారులు ఉండేలా గ్రామానికి చేరకున్నారు. రాళ్లదాడిలో ప్రజలతో పాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం గ్రామంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

Read Also: Mars Orbiter Mission: మూగబోయిన “మంగళయాన్”.. సంబంధాలు కోల్పోయామన్న ఇస్రో

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా.. ఆరిఫ్, జహీర్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ బృందాన్ని తీసుకొని గర్బా జరిగే ప్రదేశానికి వచ్చారు. ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో వీరంతా అడ్డింకిగా మారారు. దీంతో గ్రామపెద్ద వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారంత ఉత్సవాల్లో పాల్గొన్నవారిపై రాళ్లతో దాడి చేశారు. అయితే గర్బా డ్యాన్స్ చేయడం లేదని తమపై రాళ్లదాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఘటనపై విచారణ జరుగుతోంది.

ఖేడా డీఎస్సీ రాజేష్ గధియా మాట్లాడుతూ.. ఆరిఫ్, జహీర్ అనే ఇద్దరు నేతృత్వంలోని బృందం బీభత్సం సృష్టించిందని.. రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారని వెల్లడించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని.. గ్రామంలో పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు.

Exit mobile version