NTV Telugu Site icon

Electricity bill: ఫ్రిజ్, టీవీ, 4 ఫ్యాన్లకు రూ. 20 లక్షల కరెంట్ బిల్లు..

Electricity Bill

Electricity Bill

Electricity bill: ఇటీవల కరెంట్ బిల్లుల్లో తప్పులు దొర్లుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలా సాధారణ కుటుంబాలకు లక్షల్లో కరెంట్ బిల్లులు వచ్చిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కుటుంబానికి ఏకంగా రూ. 20 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి ఆ ఫ్యామిలీ షాక్ అయింది.

నవ్‌సారిలో నలుగురు నివసించే కుటుంబానికి రెండు నెలల కరెంట్ బిల్లు రూ. 20 లక్షలు రావడంతో కంగుతిన్నారు. తమకు సగటున రూ. 2000-2500 బిల్లు వస్తుందని, తమ ఇంట్లో చాలా తక్కువ విద్యుత్ వస్తువులు ఉన్నట్లు ఆ ఫ్యామిలీ చెబుతోంది. దక్షిణ గుజరాత్ పవర్ కంపెనీ జారీ చేసిన జూన్-జూలై 2024 బిల్లు రూ. 20,01,902 వచ్చినట్లు పెట్రోల్ పంపులో పనిచేస్తున్న పక్తింబెన్ పటేల్ తెలిపారు.

Read Also: Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్

‘‘మా ఇంట్లో నాలుగు బల్బులు, నాలుగు ఫ్యాన్లు, ఒక ఫ్రిజ్, ఒక టీవీ ఉన్నాయి. మేము ముగ్గురం రోజంతా పనిచేసేందుకు బయటకు వెళ్లాము’’ అని పటేల్ చెప్పారు. తాము ఎల్లప్పుడు సకాలంలోనే బిల్లుని చెల్లిస్తామని, ఒకే సారి ఇలా లక్షల్లో బిల్లు రావడం బాధ కలిగించిదని ఆమె చెప్పారు. గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (GEB)ని సంప్రదించిన తర్వాత వారు ఫిర్యాదు చేసేందుకు రుసుము చెల్లించాలని అడిగారని, అయితే, జీఈబీ అధికారి ఈ కేసును పరిశీలించి మీటర్ తప్పుడు రీడింగ్ ఇందుకు కారణంగా తెలిసింది. గంటలోనే బిల్లును సవరించడంతో ఆ కుటుంబానికి ఊరట లభించింది.

Show comments