Site icon NTV Telugu

Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం

Untitled Design (2)

Untitled Design (2)

దీపావళి సందర్భంగా తన మనవడితో కలిసి గాంధీనగర్ మార్కెట్‌లో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఒక సాధారణ వ్యక్తిలా జనంలో కలిసిపోయి.. అందరిని అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది

దేశవ్యాప్తంగా దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ వెలుగుల పండుగ సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఫోటో వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సోమవారం దీపావళి జరుపుకోవడానికి తన మనవడితో కలిసి మార్కెట్‌ను వచ్చారు. ముఖ్యమంత్రి గాంధీనగర్ వీధుల్లో సాధారణ వ్యక్తిలా కనిపించారు. ఆయన తన మనవడితో కలిసి దీపావళికి షాపింగ్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి ఓ సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేయడం చూసి అక్కడున్న ప్రజలు, దుకాణదారులు ఆశ్చర్యపోయారు.

Read Also:Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్థానిక విక్రేతల నుండి దీపాలు సహా వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని ఈ విధంగా ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి మనవడు కూడా మార్కెట్లో కొనుగోలు చేశాడు. అయితే వారు రోడ్డుపై షాపింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆయన తన మనవడితో కలిసి మార్కెట్ అంతా కలియ తిరిగారు. మార్కెట్లో, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దుకాణదారులతో సంభాషించి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సింప్లిసిటీకి స్థానికులు ముగ్ధులయ్యారు. “సీఎం అంటే కామన్‌ మ్యాన్‌” అనే సామెతను భూపేంద్ర పటేల్ నిరూపించారు స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతకుముందు ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

Exit mobile version