Site icon NTV Telugu

Cable Bridge Collapse: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్.. నదిలో పడిపోయిన 400 మంది సందర్శకులు

Gujarat

Gujarat

Gujarat Cable Bridge Collapse: గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్చీ ప్రాంతంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన ఆదివారం సాయంత్ర కూలిపోయింది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ఉన్న దాదాపుగా 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం. పునర్నిర్మాణం తరువాత ఐదు రోజుల క్రితమే కేబుల్ వంతెను పున:ప్రారంభించారు. బ్రిడ్జ్ పైకి ఒక్కసారిగా ప్రజలు రావడంతో వంతెన కూలిపోయింది. వంతెన సామర్థ్యం కన్నా ఎక్కువ మంది రావడంతోనే ప్రమాదం జరిగింది. ఆదివారం వేళ నది అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. ఈ సయమంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం వద్ద బాధితులు బంధువుల రోదనలు మిన్నంటాయి.

Read Also: Papikondalu: పర్యాటకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పాపికొండలు వెళ్లేందుకు బోట్లకు అనుమతి

నదిలో పలువురు పడిపోవడంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టంపై అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. నదిలో పడిపోయిన వారిని స్థానికుల సహకారంతో అధికారులు కాపాడుతున్నారు. ఈ సంఘటనపై ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్పందించారు. ప్రమాదం గురించి సీఎం అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. సాధ్యమైనంతగా అన్ని సహాయాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రమాదంలో మరణించిన వారికి పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షలు, మరణించిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. గుజరాత్ ప్రభుత్వం తరుపున మరణించిన వారికి రూ.4 లక్షలు, గాయపడిన వారి రూ. 50,000 పరిహారాన్ని అందించనున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు.

అమరావతిలో కుప్పకూలిన భవనం:

మహారాష్ట్ర అమరావతి పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ప్రభాత్ సినిమా ప్రాంతంలో ఉన్న భవనం ఆదివారం నాడు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. భవనం కూలిన ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనపై విచారణకు డివిజనల్ కమిషనర్ ను ఆదేశించినట్లు ట్వీట్ చేశారు. మరణించిన వారికి సీఎం ఏక్ నాథ్ షిండే రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Exit mobile version