రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. మీరు తరచూ రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నారా? ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తున్నారా..? అయితే, ఇది మీకోసమే..! ఎందుకంటే.. అన్నింటినీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు రైల్వే టికెట్ క్యాన్సిలేషన్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది.. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను రద్దు చేస్తే జీఎస్టీ చెల్లించాలి.. దీంతో, ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ మరింత ఖరీదు కానుంది.. అంటే.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ చార్జీల రూపంలో ఎక్కువ మొత్తం కట్ చేయనున్నారు.. రైల్వే టికెట్‌తో పాటు హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే కూడా ఇది వర్తిస్తుంది.. ఇప్పటికే వాటిపై క్యాన్సిలేషన్ చార్జీలు ఉండగా.. ఇక నుంచి వాటిపై అదనంగా జీఎస్టీ రూపంలో కూడా కొంత మొత్తాన్ని వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Nitin Gadkari: కాంగ్రెస్‌లో చేరాలని సన్నిహితుడి సలహా.. నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్..
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలోని ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ ఆగస్టు 3న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌కు ఛార్జ్ చేయబడిన రద్దుపై 5 శాతం జీఎస్టీ వడ్డించనున్నారు.. అదే తరహాలో విమాన ప్రయాణం లేదా హోటల్ వసతిని రద్దు చేసినప్పుడు కూడా వర్తింపజేయనున్నారు.. టికెట్ క్యాన్సిలేషన్ చార్జీల రూపంలో సర్వీస్ ప్రొవైడర్లు కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నది అందుకే అన్నమాట.. ఒకసారి రైల్వే టికెట్, హోటల్ గది బుకింగ్ జరిగాక అది సర్వీస్ ప్రొవైడర్‌కు, కస్టమర్‌కు మధ్య ఒప్పందం కిందికే వస్తుంది.. దీంతో, బుకింగ్‌ను వినియోగదారుడు రద్దు చేసుకుంటే.. అది ఒప్పందం ఉల్లంఘన కిందికి రానుంది.. దీనికి ఫైన్ రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎవరైనా నిర్దిష్ట తరగతి బుకింగ్‌లను రద్దు చేస్తే, ఆ తరగతికి సంబంధించిన సీట్లు మరియు బెర్త్‌లను బుకింగ్ చేయడానికి వర్తించే అదే జీఎస్టీ రేటు వర్తించబడుతుంది. ఉదాహరణకు, ఫస్ట్-క్లాస్ లేదా ఏసీ కోచ్‌లకు రేటు 5 శాతం..
ఉదాహరణకు 48గంటల ముందు ఎసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ కింద రూ.240 వసూలు చేస్తే ఇక మీదట 5 శాతం జీఎస్టీని కలుపుకొని.. అంటే (240+12) మొత్తం రూ.252 వసూలు చేయనున్నారు.. అయితే, సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి జీఎస్టీ వర్తించదు అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది కేంద్రం.