National creators’ awards: ప్రస్తుత జనరేషన్‌లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్‌ఫ్లూయెన్సర్, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్‌బుక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారామ్‌లు ఇందుకు వేదిక అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఏజ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’’ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.
Read Also: CM Revanth: రండి కలిసి కొట్లాడదం.. బయట వాడు మన మీదకు వస్తే..!
తొలిసారిగా ఇలాంటి అవార్డులు ‘”Gen Z”ని లక్ష్యంగా చేసుకుంటాయని, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు అలవాటు పడిన యువ తరానికి సూచననగా ఉంటుందని, మొత్తం 20 విభాగాల్లో ఈ అవార్డులు ఇవ్వబడుతాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా అవార్డుల కోసం పోటీలో ఉంటారని తెలిపాయి.
దేశం యొక్క సాఫ్ట్ పవర్, సంస్కృతిని అంతర్జాతీయంగా వ్యాప్తి చేయడంలో సహాయపడిన వారి కోసం కూడా ఒక కేటగిరి ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘గ్రీన్ ఛాంపియన్స్’’, ‘‘ స్వచ్ఛతా అంబాసిడర్స్’’, ‘‘ఆగ్రో క్రియేటర్స్’’, ‘‘టెక్ క్రియేటర్స్’’ వంటి కేటగిరీలు ఉండే అవకాశం ఉంది. వివిధ భాషల చిత్రాలను గుర్తించే జాతీయ చలనచిత్ర అవార్డుల తరహాలోనే ఈ అవార్డులు ఉంటాయని తెలుస్తోంది.
