Site icon NTV Telugu

ఇండియాలో తొలి వ్యాక్సిన్ మ‌ర‌ణం…

ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 25.90 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్లు అందించారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా జ‌రుగుతున్న‌ది.  అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొద‌ట్లో అనేక దుష్ప్ర‌భాలు క‌నిపించాయి.  కొంత‌మంది వ్యాక్సిన్ తీసుకున్నాక మ‌ర‌ణించారు కూడా.  అయితే, వ్యాక్సిన్ విక‌టించ‌డం వ‌ల‌న మ‌ర‌ణించిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు.  ఇక ఇదిలా ఉంటే, కేంద్రం మొద‌టిసారి తొలి వ్యాక్సిన్ మ‌ర‌ణాన్ని దృవీక‌రించింది.  మార్చి 8వ  తేదీన 68 ఏళ్ల వృద్దుడు వ్యాక్సిన్ తీసుకున్నారు.  వ్యాక్సిన్ తీసుకున్నాక మ‌ర‌ణించిన 31 మందిలో క‌లిగిన దుష్ప్ర‌భావాల‌పై క‌మిటీని ఏర్పాటు చేసింది.  ఈ క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో ఓ వ్య‌క్తి అన‌ఫిలాక్సిస్‌తో మ‌ర‌ణించార‌ని పేర్కొన్న‌ది.  

Exit mobile version