NTV Telugu Site icon

Delhi: పార్లమెంట్‌లోకి జమిలి బిల్లు.. ఎన్నికలు ఎప్పుడంటే..!

Onenationoneelectionbill

Onenationoneelectionbill

జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదించి.. 2029లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. బిల్లు ఆమోదం పొందేందుకు కనీసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Kadapa: 13 సార్లు యువతిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది అరెస్ట్..

245 రాజ్యసభ సీట్లలో ఎన్డీఏకి 112 సీట్లు ఉన్నాయి.. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 ఓట్లు అవసరం. అలాగే లోక్‌సభలోని 545 సీట్లలో 292 స్థానాలు ఎన్డీఏకు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ 364 ఉండాలి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అనేది తెలియాలి.

దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. దీనిపై ఎన్డీఏ-2లోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించి.. రిపోర్టును కేంద్రానికి అందించారు. దీనికి ఇటీవలే మోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బిల్లు పంపగా ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించడమే మిగిలి ఉంది. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అయితే దీనిపై సుదీర్ఘ చర్చలు ఉంటాయి. అలాగే బిల్లు ఆమోదానికి మెజార్టీ కూడా అవసరం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Mohan Babu : మనోజ్, మౌనిక వల్ల ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి!

జమిలి బిల్లును ఆమోదించేందుకు బీజేపీకి అంత బలం లేదని కాంగ్రెస్ పేర్కొంది. కచ్చితంగా బిల్లు వీగిపోతుందని తెలిపింది. మరోవైపు జమిలి ఎన్నికలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇండియా కూటమి పార్టీలు మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెడితే.. ఏం జరుగుతుందో చూడాలి.