NTV Telugu Site icon

కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం: బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు ఉప‌శ‌మ‌నం…

కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.  కుప్ప‌కూలిన‌, ఆర్ధిక మోసాల‌కు గురైన బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు ఉప‌శమ‌నం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.  డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేష‌న్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లను క్లియ‌ర్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  డిపాజిట‌ర్ల‌కు వారి మొత్తం డిపాజిట్ల‌పై రూ. 5 ల‌క్ష‌ల భీమా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  ప్ర‌భావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా ల‌భిస్తుంది.  దివాలా తీసిన బ్యాంకుల‌పై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన త‌రువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారుల కోసం డిఐసీజీసీని ఏర్పాటు చేసింది.  ఇది ఆర్బీఐ అనుబంధ సంస్థ అని కేంద్రం పేర్కొన్న‌ది.  ఇక చ‌ట్ట ప‌రిధిలో 98.3 శాతం బ్యాంకు ఖాతాలు ఉన్న‌ట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.  

Read: అక్షయ్ భారీ విరాళంతో… పాడుబడిన పాఠశాలకు ‘కోటి’ మెరుగులు!