Site icon NTV Telugu

India Pakistan Tension: పాకిస్తాన్‌‌ గొంతెండటం ఖాయం.. బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసివేత..!

Baglihar Dam

Baglihar Dam

India Pakistan Tension: పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. ఈ వేసవిలో పాకిస్తాన్ గొంతెడటం ఖాయంగా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. పాక్‌కి చెందిన లష్కరేతోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.

Read Also: Rahul Gandhi: “శ్రీరాముడి”పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిందూ వ్యతిరేకి’’ అని బీజేపీ విమర్శలు..

ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే ‘‘సింధు నది జలాల’’ ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్‌కి జీవనాడి అయిన సింధు నది జలాలను నిలిపేసే నిర్ణయం తీసుకోవడంతో ఆ దేశం ఆందోళన చెందుతోంది. తాజాగా, భారత్ చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసేయాలని నిర్ణయించింది. ఇదే కాకుండా, జీలం నదిపై ఉణ్న కిషన్‌గంగా ఆనకట్ట గేట్లను మూసేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

జమ్మూలోని రాంబన్‌లోని బాగ్లిహార్, ఉత్తర కాశ్మీర్‌లోని కిషన్‌గంగా రెండు జల విద్యుత్ ఆనకట్టలు. ఇవి భారతదేశానికి సింధు ఉపనదుల నీటిని నియంత్రించే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే, భారత్ చీనాబ్ నది నీటిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాకిస్తాన్ సియాల్‌కోట్ నగరంలోని చీనాబ్ నదిలో ప్రవాహం తగ్గింది. ఇప్పుడు, మరిన్ని నిర్ణయాలతో ఆ కొద్దిపాటి నీరు కూడా వేసవి కాలంలో పాకిస్తాన్‌కి అందే అవకాశం లేకుండా పోతుంది. పహల్గామ్ దాడి తర్వాత 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని భారత్ నిలిపేసింది.

Exit mobile version