NTV Telugu Site icon

Dk Shivakumar: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర

Dksivakumar

Dksivakumar

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర చేస్తున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆరోపించారు. ఇటీవల ముడా స్కామ్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సిద్ధరామయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రిలీప్ దొరికింది.

ఇది కూడా చదవండి: Physical abuse: బాలికలకు పోర్న్ వీడియోలు చూపించి శారీరక వేధింపులు..

తాజాగా ఇదే అంశంపై డీకే.శివకుమార్ స్పందించారు. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని శివకుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్‌ వెనక్కి పంపారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని చెప్పుకొచ్చారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ అనుమతివ్వడాన్ని శివకుమార్‌ తప్పుబట్టారు. ఈ విషయంలో సీఎంకు పార్టీ సభ్యులంతా అండగా నిలుస్తారన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించవని తెలిపారు.

ఇది కూడా చదవండి: Home Minister Anitha: అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి