Site icon NTV Telugu

ఫేక్ న్యూస్‌.. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌పై కేంద్రం సీరియ‌స్‌..!

సోష‌ల్ మీడియాలో ఎప్పుడు ఏదోఒక‌టి ఫేక్ న్యూస్ తెగ ర‌చ్చ చేస్తోంది.. అస‌లు ఏది వైర‌ల్‌, ఏ రియ‌ల్ అని క‌నిపెట్ట‌డ‌మే క‌ష్టంగా మారింది… అది ఫేక్ అని తెలిసేలోపే.. వైర‌ల్‌గా మారి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ వ్య‌వ‌హారంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌ల‌పై కేంద్ర స‌ర్కార్ సీరియ‌స్ అయిన‌ట్టుగా తెలుస్తోంది.. ఫేక్ న్యూస్ అరిక‌ట్ట‌డంలో తగినన్ని చర్యలు చేపట్టక పోవ‌డంలో కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టుగా స‌మాచారం. అయితే, సామాజిక మాద్య‌మాల్లో వచ్చే నకిలీ వార్తలను రిమూవ్ చేసేందుకు ఇటీవల గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలతో కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు స‌మావేశం నిర్వ‌హించ‌గారు.. జనవరి 31వ తేదీన‌ వర్చువల్ గా జ‌రిగిన ఈ సమావేశంలో ఆయా సంస్థ‌లు, సమాచార మ‌రియు ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు మధ్య చ‌ర్చ తీవ్రంగా జ‌రిగిన‌ట్టు నేష‌న‌ల్ మీడియా పేర్కొంది.

Read Also: తెలంగాణ‌లో ఈ రోజు ఎన్ని కోవిడ్ కేసులంటే..

కాగా, గ‌త రెండు నెల‌ల్లోనే భార‌త ప్ర‌భుత్వం 55 యూట్యూబ్ ఛానెళ్లు, 2 ట్విట్టర్ ఖాతాలు, 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌లను నిషేధించిన విష‌యం తెలిసిందే.. అదే ప‌నిగా కొన్ని చానెళ్లు ఫేక్ వార్త‌లు కానీ లేదా భారత వ్యతిరేక వార్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయ‌న్న కార‌ణంతో ఈ చ‌ర్య‌లు తీసుకోంది కేంద్రం.. పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని భార‌త్‌లో ప్ర‌చారం చేస్తున్నాయ‌ని కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. ఇక‌, మిలియన్ల మంది వినియోగదారులను కలిగి దేశీయ కంటెంట్-భాగస్వామ్య వేదికలుగా ఉన్న‌ షేర్ చాట్ లాంటి సంస్థ‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.. ఈ భేటీలో.. స్థానిక చట్టాలకు లోబ‌డి ఉన్న కంటెంట్‌ను మాత్ర‌మే ప‌రిమితం చేస్తామ‌ని.. మిగ‌తా కంటెంట్‌ను తొల‌గిస్తామ‌ని కొన్ని సంస్థ‌లు కేంద్రానికి హామీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి పెద్ద సంస్థ‌లే ఫేక్ న్యూస్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో విఫలం అవుతున్నార‌ని.. ఆయా సంస్థ‌ల విష‌యంలో స‌ర్కార్ నిరాశ‌కు గురైన‌ట్టు అధికారులు తెలిపారు.

Exit mobile version