NTV Telugu Site icon

Medicines Prices: షుగర్, గుండె జబ్బులతో సహా 41 రకాల మెడిసిన్స్ ధరల్ని తగ్గించిన ప్రభుత్వం..

Medicines Prices

Medicines Prices

Medicines Prices: మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణంగా ఉపయోగించే మందులు, ఆరు ఫార్ములేషన్స్‌ ధరలను ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మరియు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ధరలు తగ్గిన మందుల జాబితాలో యాంటిసిడ్స్, మల్టీమిటమిన్, యాంటీబయాటిక్స్ ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరల సమాచారాన్ని వెంటనే డీలర్లు, స్టాకిస్టులకు అందించాలని ఫార్మా కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి.

Read Also: Brain Haemorrhage: 10వ తరగతిలో 99% మార్కులు సాధించిన అమ్మాయి.. బ్రెయిన్ హెమరేజ్ తో మృతి..

నిత్యావరస ఔషధాలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరల తగ్గింపు వల్ల దేశంలోని దాదాపుగా 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రయోజనం పొందొచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ గత నెలలో 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు సవరించిన వార్షిక సీలింగ్ ధరల్ని, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరల్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది.

Show comments