NTV Telugu Site icon

Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..

Parliament Session

Parliament Session

Parliament Session: రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం కీలమైన 6 బిల్లులను ప్రవేశపెట్టనునంది. విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసే బిల్లును తీసుకురానుంది. దీని కోసం 90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. దీంతో సహా ఆరు కొత్త బిల్లులను సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతుంది. ఆర్థిక బిల్లులతో పాటు ‘ది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు’ను కూడా జాబితా చేసింది. ఈ చట్టం ద్వారా వివత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పనితీరులో మరింత స్పష్టత, కలయికను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోక్‌సభ బులెటిన్ గురువారం పేర్కొంది.

Read Also: Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం.. సీఎం ఆందోళన..

‘భారతీయ వాయుయాన్ విధేయక్’ ద్వారా 2024 పౌర విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనుమతించే నిబంధనలను తీసుకురావడానికి 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేయనుంది. జూలై 22 ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగుస్తాయి. జూలై 23న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న చట్టాలను రీప్లేస్ చేసేందుకు ‘బాయిలర్స్ బిల్’ ని తీసుకురాబోతోంది. కాఫీ (ప్రమోషన్ మరియు అభివృద్ధి) బిల్లు మరియు రబ్బరు (ప్రమోషన్ మరియు అభివృద్ధి) బిల్లు స్థానంలో బాయిలర్‌ల బిల్లును తీసుకు వస్తోంది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)ని కూడా ఏర్పాటు చేశారు. స్పీకర్ అధ్యక్షత ఏర్పడిన కమిటీలో సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి), పిపి చౌదరి (బిజెపి), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), నిషికాంత్ దూబే (బిజెపి), గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), సంజయ్ జైస్వాల్ (బిజెపి), దిలేశ్వర్ కమైత్ (జెడి- యు), భర్తృహరి మహతాబ్ (బిజెపి), దయానిధి మారన్ (డిఎంకె), బైజయంత్ పాండా (బిజెపి), అరవింద్ సావంత్ (శివసేన-యుబిటి), కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), అనురాగ్ ఠాకూర్ (బిజెపి) మరియు లాల్జీ వర్మ (ఎస్‌పి) సభ్యులుగా ఉన్నారు.