Site icon NTV Telugu

పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలు మూసివేత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ర్టంలో అవసరమైతే పాఠశాలల, కళాశాలలు మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్‌ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నందు వల్ల కోల్‌కతాలో కంటైన్ మెంట్‌ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు.

Read Also:సీఎం జగన్ అమూల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు: దూళిపాళ్ల నరేంద్ర

మంగళవారం బెంగాల్‌లో 752 కేసులు నమోదు అయ్యాయి. అందులో కోల్‌కతాలో 204 కేసులు, 24 ఉత్తర పరగణాల్లో 102 కేసులు వచ్చాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందు జాగ్రత చర్యగా విద్యాసంస్థలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఓ వైపు దేశంలో ఒమిక్రాన్‌ కేసులు సైతం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒమిక్రాన్‌ తీవ్రతను తెలియజేస్తుంది.

Exit mobile version