NTV Telugu Site icon

CNG Prices: పెరిగిన CNG ధర.. ఎంతంటే.?, ఏ రాష్ట్రాల్లో ప్రభావం..

Cng

Cng

CNG Prices: పెట్రోల్, డీజిల్ ధరలతో బాధపడుతున్న సామాన్యుడిపై CNG భారం పడింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ. 1 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ధరలు జూన్ 22, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ధరల ప్రభావం దేశ రాజధాని న్యూఢిల్లీలో పాటు ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండనుంది.

CNG ధర పెరగడం వల్ల ఆటో రిక్షాలు, టాక్సీలు, వ్యక్తిగత వాహనాలు కలిగిన వారిపై భారం పెరుగుతుంది. ఈ పెరుగుదల రవాణా ఖర్చులను పెంచే అవకాశం ఉంది. గత కొన్ని నెలల్లో సీఎన్‌జీ ధర పెరగడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే ద్రవ్యోల్భణ ప్రభావంతో సతమతమవుతున్న వినియోగదారులు సీఎన్‌జీ పెంపుతో మరింత ఇబ్బందిపడనున్నారు.

Read Also: Chicken Keema Matar Recipe: చికెన్తో ఇలా ట్రై చేయండి.. లొట్టలేసుకుని తింటారు

ధరల వివరాలు:

* న్యూఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 74.09గా ఉంటే ప్రస్తుత పెంపుతో రూ. 75.09కి చేరింది.
* ఢిల్లీ(NCR (నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్)లో కేజీ సీఎన్‌జీ ధర రూ. 78.70 నుంచి రూ. 79.70కి పెరిగింది.
* ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ముజఫర్‌నగర్ మరియు షామ్లీలో CNG ధరలు కిలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది.
* రాజస్థాన్‌లో అజ్మీర్, పాలి, మరియు రాజ్‌సమంద్, CNG ధరలు కిలో రూ.81.94 నుంచి రూ.82.94కి పెరిగింది.