Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
- ప్రధాని మోడీ మాట విని బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వాళ్లు హ్యాపీ..
- గతంలో రెండు సార్లు బంగారం కొనడం తగ్గించాలని ప్రధాని విజ్ఞప్తి..
- ఇప్పుడు గణనీయంగా పడిపోయిన పుత్తడి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Crash 2026: బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని నెలల క్రితం పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లకు సంబంధించి ప్రజలకు రెండుసార్లు కీలక విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని సూచించారు. తొలుత మే నెలలో, ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆకాశాన్ని అంటిన ధరలు, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. దీంతో ప్రధాని మోడీ సలహాపై బంగారం కొనుగోళ్లను నిలిపేసిన వారు ఇప్పుడు ధరలు తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. సుమారు పది నెలల క్రితం నమోదైన ధరలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఒక దశలో వెండి ధర రూ.4 లక్షలు దాటగా, బంగారం ధర రూ.2 లక్షలకు చేరువైంది.
Also Read
- Supreme Court: మేనరిక వివాహాలపై సుప్రీం నోటీసులు.. ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిటిషన్..
- Nepal PM Balen Shah: సంప్రదాయానికి భిన్నంగా నేపాల్ ప్రధాని అడుగులు.. మోదీ, ముర్ములకు అరుదైన చారిత్రక బహుమతులు!
- Gold Rates Down: బంగారం ధరలు భారీగా పతనం.. మోడీకి థాంక్స్ చెప్పిన సీటీఐ..
- CM Vijay: రైతుల కన్నా హెయిర్స్టైల్పైనే ఎక్కువ శ్రద్ధ.. సీఎం విజయ్‌పై అన్నాడీఎంకే విమర్శలు!
ధరలు పెరగుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, విదేశీ మారకద్రవ్యం నిల్వలు పరిరక్షించుకోవడానికి ప్రధాని మోడీ బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని సూచించారు.
బంగారం కొనుగోళ్లపై తాజాగా ప్రధాని ఏమన్నారు.?
శనివారం లక్నోలో జరిగిన కౌశల్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాన నరేంద్ర మోడీ ‘‘బంగారం కొనుగోళ్లు వద్దు’’ అని చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. సుమారు ఏడాది క్రితం అవసరమైతేనే బంగారం కొనాలని దేశ ప్రజకలు చెప్పానని, అప్పట్లో చాలా మంది తన వ్యాఖ్యల్ని ఎగతాళి చేశారని అన్నారు. కాని ఇప్పుడు తన సలహా పాటించడం వల్ల తమ డబ్బు ఆదా అయిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు.
ఇదే సమయంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలన్న ప్రధాని మోడీ విజ్ఞప్తిపై వ్యాపారుల సంఘం ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) స్పందించింది. ఈ మేరకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని సూచన తర్వాత ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపార సంఘం చైర్మన్ బ్రిజేష్ గోయల్ అన్నారు. ఆయన సూచనను పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసి ఉంటే భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పారు.
అప్పటికీ ఇప్పటికీ ఎంత తగ్గింది.?
పది నెలల క్రితం ధరలతో పోలిస్తే ఇప్పుడు బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. మే 11న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,50,362గా ఉంది. గత శుక్రవారం నాటికి ఈ ధర రూ.1,23,893కు పడిపోయింది. మే నెలతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ. 26,469 తగ్గుదల నమోదైంది. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మే 11న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,835గా నమోదైంది. గత శుక్రవారం నాటికి ఈ ధర రూ.1,21,949కు పడిపోయింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,886 మేర తగ్గింది.
తాజావార్తలు
-
Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
-
Ind Vs Pak: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. బౌండరీ ఆపే క్రమంలో వైభవ్‌కు గాయం..
-
Supreme Court: మేనరిక వివాహాలపై సుప్రీం నోటీసులు.. ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిటిషన్..
-
Nepal PM Balen Shah: సంప్రదాయానికి భిన్నంగా నేపాల్ ప్రధాని అడుగులు.. మోదీ, ముర్ములకు అరుదైన చారిత్రక బహుమతులు!
-
CM Revanth Reddy : కాంగ్రెస్ పీఏసీలో రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి రెండు డిమాండ్లు
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!