Site icon NTV Telugu

గోవాలో పొలిటిక‌ల్ హీట్‌.. పోటీ నుంచి త‌ప్పుకున్న మాజీ సీఎం..

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ గోవాలో పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోతోంది.. తాజాగా ఊహించ‌ని ప‌రిణామామే చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న మాజీ సీఎం ప్ర‌తాప్ సింహ రాణే.. పోటీ నుంచి త‌ప్పుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది.. ఈ వ్య‌వ‌హారంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది.. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం పోరియం నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా ప్ర‌తాప్ సింహ రాణేను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ.. కానీ, తాజాగా ఆయ‌న పోటీ నుంచే త‌ప్పుకున్నారు. ఇక‌, అస‌లు విష‌యానికే వ‌స్తే.. ప్ర‌తాప్ సింహ రాణే కోడ‌లు దేవీయ విశ్వ‌జిత్ రాణేను పోరియం నియోజ‌క‌వ‌ర్గం నుంచే బ‌రిలోకి దింపింది బీజేపీ.. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

Read Also: వాళ్లు మ‌ళ్లీ వ‌స్తారు.. టెన్ష‌న్ వ‌ద్దు..

కాగా, ఈ ప‌రిణామాల‌పై స్పందించిన ప్ర‌తాప్ సింహ రాణే.. త‌న వ‌య‌స్సు 87 ఏళ్లు.. వ‌య‌సురీత్యా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాను.. అందుకే పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలిపారు. ఇక‌, పోరియం నుంచి ఏకంగా 11 సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు ప్ర‌తాప్ సింహ రాణే.. గోవా సీఎంగా అత్య‌ధిక కాలం ప‌నిచేసిన వ్య‌క్తిగా కూడా రికార్డు సృష్టించారు. మ‌రోవైపు ఆయ‌న కుమారుడు విశ్వ‌జీత్ రాణే.. బీజేపీ స‌ర్కార్‌లో గోవాలో మంత్రిగా ఉన్నారు.. మొత్తంగా తాజా ప‌రిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్‌గానే చెప్పాలి.

Exit mobile version