NTV Telugu Site icon

Go Back Modi: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “గో బ్యాక్ మోదీ”

Go Back Modi Trending On Twitter

Go Back Modi Trending On Twitter

“Go Back Modi” trending on Twitter: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కలిచివేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్ లో ఓ వంతెన కూలిన ఘటనపై మోదీ చేసిన ‘ఆక్ట్ ఆఫ్ గాడ్ కాదు ఆక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు గుజరాత్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Read Also: Russia-Ukraine War: అందుకే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్‌పై దాడి చేస్తున్నామన్న పుతిన్

ఈ రోజు మోర్బీ వంతెన కూలిన ఘటన స్థలానికి వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే ‘ గో బ్యాక్ మోదీ’ అంటూ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా గుజరాత్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు నెటిజెన్లు. దీంతో పాటు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీ సివిల్ ఆస్పత్రికి రంగులు వేయడం, టైల్స్ వేయడం వంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసి గుజరాత్ ప్రమాదంలో వందలాది మంది చనిపోతే.. మోదీ మాత్రం ఎన్నికల ర్యాలీపై శ్రద్ధ చూపిస్తున్నారంటూ పలువురు నెటిజెన్లు విమర్శించారు. మోర్బీలో ఆస్పత్రికి రంగులు వేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ గుజరాత్ మోడల్ వట్టిదే అని.. ద్రవిడియన్ మోడల్ బెటర్ అని చేపుతూ.. తమిళనాడులోని ఓ ఆస్పత్రి ఫోటోలు షేర్ చేయడం చూడవచ్చు. మోదీ కార్పొరేట్లకే కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్ నుంచి బీజేపీని తరిమికొట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.