Global Crime Survey: గ్లోబర్ క్రైమ్ సర్వే నంబియో తాజా ర్యాకింగ్స్ ప్రకారం.. దేశంలో ఎక్కువ నేరాలు జరుగుతున్న నగరాల్లో న్యూఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా చూస్తే ఢిల్లీ అత్యధిక నేరాలు జరిగే నగరాల్లో 70వ స్థానంలో ఉంది. ఢిల్లీతో పాటు భారత్‌లోని 10 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. నోయిడా 87వ స్థానంలో ఉండగా.. గురుగ్రామ్ 95వ స్థానంలో ఉంది.
Read Also: Donald Trump: జోబైడెన్ డ్రగ్స్ తీసుకున్నాడు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..
దక్షిణ భారతదేశంలో బెంగళూర్ నగరంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ జాబితాలో బెంగళూర్ 102వ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 174వ స్థానంలో ఉంది. మిగతా నగరాలను పరిశీలిస్తే ఇండోర్ (136), కోల్‌కతా (159), ముంబై (169), చండీగఢ్ (177), మరియు పూణే (184) స్థానాల్లో ఉన్నాయి.
టాప్-20లో 5 దక్షిణాఫ్రికా నగరాలు:
ప్రపంచవ్యాప్తంగా నేరాలు ఎక్కువగా జరిగే నగరాల్లో మొదటిస్థానంలో వెనుజులాలోని కారకాస్ ఉండగా, దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా రెండో స్థానంలో ఉంది. డర్బన్3వ స్థానంలో, జోహన్నెస్‌బర్గ్ 4వ స్థానంలో, పోర్ట్ ఎలిజబెత్ 8వ స్థానంలో, కేప్ టౌన్ 18వ స్థానంలో ఉన్నాయి.
