Site icon NTV Telugu

Amit Shah: ఆయుధాలు వదలి చర్చలకు రండి, లేదంటే చస్తారు.. ఉగ్రవాదులకు అమిత్ షా పిలుపు..

Amit Shah

Amit Shah

Amit Shah: జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదులతో శాంతికి సిద్ధమే అని ప్రకటించారు. ఆయుధాలు వదులుకుని, ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని లేదా భద్రతా బలగాల చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా గురువారం కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదులో చర్చలు కోరుకుంటున్నాయని, చర్చించాలంటే ముందు ఆయుధాలు వదులుకోండని, ఈశాన్య రాష్ట్రాల్లో 10000 మంది లొంగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

Read Also: Arunachal Pradesh: 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్‌కు మరణశిక్ష!

జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఆయుధాలు వదిలిపెట్టి చర్చలకు రావాలని, లేకపోతే మా బలగాలు మిమ్మల్ని పాతాళంలో పాతిపెడతాయని హెచ్చరించారు. మూడు దశాబ్ధాలుగా తీవ్రవాదంతో నష్టపోయిన జమ్మూ కాశ్మీర్‌లో అట్టడుగు స్థాయి నుంచి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్‌లు 40 ఏళ్లుగా ఉగ్రవాదానికి రక్షణ కల్పించారని, మేము టెర్రరిజాన్ని అంతం చేసి, జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధికి ద్వారాలు తెరిచామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు విశ్రమించబోయేది లేని చెప్పారు.

Exit mobile version