NTV Telugu Site icon

Gujarat High Court: ఆడపిల్లలు 17 ఏళ్లకే జన్మనిస్తారు.. మనుస్మృతి చదవండి.. అబార్షన్‌పై గుజరాత్ హైకోర్టు

Gujarat High Court

Gujarat High Court

Gujarat High Court: బాలిక అబార్షన్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 17 ఏళ్ల బాలిక తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది కోర్టు. గతంలో 14-15 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని, 17 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చేవారని గుజరాత్ హైకోర్టు గురువారం మౌఖికంగా వ్యాఖ్యానించింది.

Read Also: Harish Rao: కాంగ్రెస్, బిజెపి వాళ్ళవి మాయమాటలు.. కన్ఫ్యూజ్ చేసి సీట్లు గెలవాలని చూస్తున్నారు

మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాతే ఆమె గర్భం దాల్చిందని ఆమె తండ్రికి తెలిసింది. బాలిక వయస్సు దృష్ట్యా పిండాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గర్భం రద్దు కోసం పిటిషనర్ న్యాయవాది కోరాడు. ఈ సమయంలో జస్టిస్ సమీర్ జే డేవ్.. పాతకాలంలో అమ్మాయిలు పాత కాలంలో అమ్మాయిలకు 14-15 సంవత్సరాలలోపు వివాహం మరియు 17 ఏళ్లలోపు సంతానం కలగడం సాధారణం. మీరు చదవరు, కానీ దీని కోసం ఒక్కసారి మనుస్మ్రుతి చదవండి.

డెలివరీ తేదీ ఆగస్టు 18 కావడంతో ముందస్తు విచారణ కోసం మైనర్ బాలిక తండ్రి తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది సికిందర్ సయ్యద్ కోర్టు ముందు అప్పీల్ చేశారు. అయితే గర్భంలోని పిండం, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటే గర్భం తీసేయడానికి అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. బాలికకు వైద్య పరీక్షలు చేయాలని, మైనర్ బాలికకు అత్యవసర ప్రాతిపదికన సివిల్ హాస్పిటల్ వైద్యుల ప్యానెల్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాజ్‌కోట్‌లోని సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. వైద్యుల కమిటీ నివేదిక అందిన తర్వాత ఈ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 15కి వాయిదా వేసింది.