Site icon NTV Telugu

Zipline: జిప్‌లైన్ బెల్ట్ తెగి లోయలో పడిన బాలిక.. మనాలి ఘటన వైరల్..

Zipline

Zipline

Zipline: నాగ్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబానికి విహారయాత్ర విషాదంగా మారింది. నాగ్‌పూర్‌కి చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం మనాలి టూర్‌కు వెళ్లింది. అయితే, వీరి కూతురు ప్రమాదవశాత్తు జిప్‌లైన్ బెల్ట్ తెగడంతో 30 అడుగుల లోయలో పడిపోయింది. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేద్ధామని వెళ్లిన వీరికి ఈ టూర్ పీడకలగా మారింది. ఈ ఘటన జూన్ 8న జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే ఏమౌతుందంటే…

10 ఏళ్ల బాలిక త్రిష బిజ్వే జిప్‌లైన్‌‌పై వెళ్తున్న సమయంలో హఠాత్తుగా బెల్ట్ ఊడిపోయింది. చాలా ఎత్తు నుంచి కింద పడిపోవడంతో బాలిక కాలు విరిగింది. శరీరంలో అనేక ఫ్రాక్చర్లు చోటు చేసుకున్నాయి. అయితే, సంఘటనా స్థలంలో భద్రతా చర్యలు లేవని, ప్రమాదం తర్వాత తక్షణ సాయం కూడా అందలేదని కుటుంబం ఆరోపిస్తోంది. ఘటన జరిగిన వెంటనే మనాలిలో త్రిషకు వైద్య సాయం అందించారు. ఆ తర్వాత చండీగఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలిక నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, బాలిక పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్‌ గానే ఉందని కుటుంబీకులు చెబుతున్నారు.

Exit mobile version