Site icon NTV Telugu

Madhyapradesh: బోరుబావిలో 2 ఏళ్ల చిన్నారి.. 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్..

Madhyapradesh

Madhyapradesh

Madhyapradesh: మధ్యప్రదేశ్ సెహెర్ జిల్లాలోని ముంగోలి గ్రామంలో 2 ఏళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి 300 అడుగుల లోతున్న బోరుబావిలో మంగళవారం పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గత 24 గంటల నుంచి బాలికను బయటకు తీసేందుకు అధికారులు కష్టపడుతున్నారు. 50 అడుగుల పీట్ల లోతులో చిన్నారి చిక్కుకుపోయింది. అంతకుముందు 20 ఫీట్లలో ఉన్న చిన్నారి, ఆ తరువాత మరింత లోతుకు జారిపోయింది.

Read Also: Nagam Janardhan Reddy: కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. నాగం జనార్ధన్ డిమాండ్

ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆశిష్ తివారీ దగ్గరుండి రెస్క్యూ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆఫ్ఎఫ్ బలగాలు పనిచేస్తున్నాయి. బోరుకు సమాతరంగా యంత్రాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. రాతి నేల కావడంతో సమయం ఎక్కువ పడుతోందని కలెక్టర్ వెల్లడించారు. నేలను తవ్వే కొద్దీ బాలిక బోరు బావిలోకి జారిపోతుందని, ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నామని, రాయి కారణంగా డ్రిల్లింగ్ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం బోరుకు సమాంతరంగా 26-27 ఫీట్ల గోతిని తవ్వారు. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం ఆమెను బోర్‌వెల్ నుండి తరలించే ప్రక్రియను ప్రారంభించిందని ఆయన ట్వీట్ చేశారు.

Exit mobile version