NTV Telugu Site icon

Ghaziabad Case: ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్.. ఐదుగురిని ఇరికించేందుకు మహిళ డ్రామా

Delhi Case

Delhi Case

Ghaziabad woman’s physical assault case false conspiracy: ఢిల్లీ-ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురిని ఇరికించే ప్రయత్నంలో సదరు మహిళ గ్యాంగ్ రేప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసుల.. ఆమె చెప్పినదాని ప్రకారం ముందుగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగం మహిళ ఆస్తి వివాదంలో కట్టుకథ అల్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ డ్రామాకు సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మీరట్ రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆస్తి వివాదంలో నిందితుడిని ఇరికించేందుకు ఆజాద్ అనే వ్యక్తితో మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు చేసిందని వెల్లడించారు. ఆజాద్ అతని సహచరులు గౌరవ్, అప్జల్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కుట్రకు ఉపయోగించిన ఆల్టో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిపై అత్యాచారం కేసు బుక్ చేసేందుకు మహిళ కుట్ర పన్నినట్లు తేల్చారు.

Read Also:China Spy: బౌద్ధ సన్యాసిని ముసుగులో చైనా గూఢాచారి.. అరెస్ట్ చేసిన పోలీసులు

అక్టోబర్ 18 ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ ఘజియాబాద్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి వెళ్లివచ్చే సమయంలో బస్టాండ్ లో ఉన్న ఆమెను కారులో అపహరించి రెండు రోజుల పాటు నిర్భందించి ఐదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్ చొప్పించారని.. బాధిత మహిళ తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో మహిళ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. మొదటగా ఘజియాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్తే, అందుకు ఆమె తిరస్కరించింది. మీరట్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా చేసింది. చివరకు ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. ఆస్తి వివాదంలో నిందితులను ఇరికించేందుకు అత్యాచారం కుట్రకు పాల్పడినట్లు వెల్లడిచింది. విచారణ సమయంలో ఆజాద్ మొబైల్ స్విచ్ఛాప్ ఉండటం కూడా పోలీసుల అనుమానాలను బలపడేలా చేశాయి. దీంతో అత్యాచారం కుట్ర వీడింది.