Fire Break : ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • గజియాబాద్‌లోని ఫర్నిచర్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • ఫర్నిచర్, కారు, బైక్ దగ్ధం.. లక్షల్లో ఆస్తి నష్టం
  • నాలుగు గంటల శ్రమతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
  • షార్ట్ సర్క్యూటే కారణమా? ప్రమాదంపై అధికారుల విచారణ
Fire Break

Fire Break

Fire Break : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో బుధవారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సాహిబాబాద్ ప్రాంతంలోని ఒక లోకల్ ఫర్నిచర్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారితీసింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బూడిదైన ఫర్నిచర్.. లక్షల్లో ఆస్తి నష్టం

ఫ్యాక్టరీలో అంతా కలప, కుర్చీలు, సోఫాల తయారీకి వాడే వస్తువులు (రౌ మెటీరియల్) ఉండటం వల్ల మంటలు చాలా వేగంగా ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. చూస్తూ చూస్తూనే లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కాలి బూడిదైపోయింది. దీనివల్ల ఫ్యాక్టరీ యజమానికి లక్షల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాకుండా, ఫ్యాక్టరీ ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఒక కారు, బైక్ కూడా ఈ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.

×
×
Ad

నాలుగు గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్లు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న మిగతా బిల్డింగులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు కష్టపడి, ఎట్టకేలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

షార్ట్ సర్క్యూటే కారణం.. తప్పిన పెద్ద ప్రమాదం

ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఫ్యాక్టరీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, ఎవరికీ గాయాలు కూడా కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో పెరుగుతున్న ఎండలు, ఉక్కపోత వల్ల విద్యుత్ వైర్లపై లోడ్ పడి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫ్యాక్టరీల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.