NTV Telugu Site icon

Gay marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలి.. సుప్రీంకోర్టుకు హైదరాబాద్ జంట

Supreme Court

Supreme Court

Gay Couple Moves Supreme Court Seeking Recognition Of same gender marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని.. తమ వివాహాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఓ స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టుకెక్కింది. లెస్బియన్ కమ్యూనిటి LGBTQ+కి చెందిన సభ్యులు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అనుమతించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడాన్ని పిటిషనర్ లేవనెత్తాడు. తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రాథమిక హక్కులను అమలు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఒకరినొకరు వివాహం చేసుకోవడం తమ ప్రాథమిక హక్కుల్లో ఒకటని పిటిషనర్లు సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు.

Read Also: PM Narendra Modi: భారత చరిత్ర అంటే వలసవాదం కాదు.. యోధులు, వీరుల చరిత్ర

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. LGBTQ+ సభ్యులకు కూడా ఇతర పౌరులకు సమానం అయిన హక్కులు ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. తమ పెళ్లిని గుర్తించపోవడం అంటే ఆర్టికల్స్ 14, 15, 19(1)(ఎ), 21లతో సహా రాజ్యాంగంలోని పార్ట్ 3 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు.

ఈ కేసుపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ కు చెందిన స్వలింగ సంపర్కల జంట సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ జరిపింది. హైదరాబాద్ కు చెందిన సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ గత పదేళ్లుగా కలిసి ఉంటున్నారు. గత డిసెంబర్ నెలలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య 9వ వివాహ వార్షికోత్సవాన్ని జరుకున్నారు. ఈ జంట తరుపున అరుంధతీ కట్జూ, ప్రియాపూరి, సృష్టి బోర్తకూర్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ స్వలింగ సంపర్కుల జంట గత పదేళ్లుగా సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్నారు.