Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాద నేత, పలు ఉగ్రవాద ఘటనలో సంబంధం ఉన్న యాసిన్ మాలిక్ తాను 1994 నుంచి హింసను విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఐక్య, స్వతంత్ర కాశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. ఆయుధాలను వదిలినప్పటికీ మాలిక్ ఇప్పటికీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాడని కేంద్రం పేర్కొంది. చట్టవిరుద్ద కార్యకలాపాల(నివారణ)చట్టం(UAPA) ట్రిబ్యునల్ ముందు యాసిన్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను అహింసను స్వీకరించి, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టినట్లు చెప్పారు.
Read Also: PM Narendra Modi: డ్రగ్స్ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
జమ్మూ మరియు కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ (JKLF-Y) వ్యవస్థాపకుడుగా యాసిన్ మాలిక్ ఉన్నాడు. 1990లో కాశ్మీర్ లోయలో సాయుధ మిలిటెన్సీకి నాయకత్వం వహించిన JKLF-Yపై నిషేధాన్ని గురించి ట్రిబ్యునల్ విచారించింది. దీనిపై ట్రిబ్యునల్ ముందు తాను గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ నిషేధాన్ని ట్రిబ్యునల్ సమర్థించింది. మరో ఐదేళ్లపాటు దీనిని చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ముందు యాసిన్ మాలిక్ అఫిడవిట్ సమర్పించాడు.
1990లో శ్రీనగర్‌లోని రావల్‌పొరాలో భారత వైమానిక దళానికి చెందిన నలుగురు సైనికులను హత్య చేసిన కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఈ ఘటనలో స్వ్కాడ్రన్ లీడర్ రవిఖన్నా మరణించాడు. ఈ దాడిలో మరో 22 మంది గాయపడ్డారు. ప్రస్తుతం తీవ్రవాద నిధులకు సంబంధించి కేసులో దోషిగా నిర్ధారించబడిన మాలిక్, తీహార్ జైలులో జీవితఖైదును అనుభవిస్తున్నాడు.