Mukhtar Ansari: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవతఖైదు విధించింది. 1990లో నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా ఆయుధ లైసెన్స్ పొందిన కేసులో బుధవారం అన్సారీకి జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 428 (అపరాధం), 467 (విలువైన భద్రతను ఫోర్జరీ చేయడం), 468 (మోసం కోసం ఫోర్జరీ), 120బి (నేరపూరిత కుట్ర) మరియు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30 కింద జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్‌ని దోషిగా నిర్ధారించారు.
Read Also: Manohar Lal Khattar: సీఎం పదవికి రాజీనామా తర్వాత, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఖట్టర్..
హత్య సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్తార్ అన్సారీ డబుల్ బ్యారెల్ గన్ లైసెన్స్ కోసం ఘాజీపూర్ జిల్లా మెజిస్ట్రేట్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్), ఎస్పీ నకిలీ సంతకాలు ఉపయోగించి ఆయుధ లైసెన్స్ పొందారు. 1990లో సీబీఐ విచారణలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అన్సారీతో పాటు ఐదుగురిపై ఘాజీపూర్‌లోని మొహదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ముఖ్తార్ అన్సారీని పంజాబ్ జైలు నుంచి యూపీ తీసుకువచ్చిన తర్వాత 2021 నుంచి బందా జైలులో ఉంటున్నాడు.
