NTV Telugu Site icon

Gangster rally: జైలు బయట గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహం.. పోలీసులు ఏం చేశారంటే..!

Gangsterrally

Gangsterrally

ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలై.. తిన్నగా ఇంటికి వెళ్లకుండా.. ఎక్స్‌ట్రాలకు పోయి తిరిగి చెరసాలకు వెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ జూలై 23న జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక.. అతని మద్దతుదారులు పెద్ద ఎత్తున కారు, బైక్ భారీ ర్యాలీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో తిరిగి అతన్ని జైలుకు పంపించారు.

హర్షద్ పాటంకర్‌ను ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం (MPDA) కింద జైలు శిక్ష విధించబడింది. అయితే ఈనెల 23న జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చాక మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ.. పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసులు తిరిగి జైలుకు పంపించారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు దాదాపు 15 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోలో పాటంకర్.. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి అభివాదం చేశాడు. మద్దతుదారులకు చేతులు ఊపి ఉత్సాహపరిచాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు పాటంకర్, అతని ఆరుగురు మద్దతుదారులను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తాజా నివేదికల ప్రకారం.. అతనిపై హత్యాయత్నం, దొంగతనం మరియు హింసతో సహా అనేక కేసులు పోలీసులు నమోదు చేశారు.