తొలిసారిగా ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అవకాశం దక్కడం గొప్ప విషయం అని.. ద్రౌపతి ముర్ము గెలవడం ఖాయమని అన్నారు ఎంపీ జీవీఎల్ నర్సింహరావు. ముర్ము అభ్యర్థిత్వంతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ఇతర పార్టీలు పార్టీలు కూడా ద్రౌపతి ముర్ముకే మద్దతు పలికే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. దేశంలో జూలై 1 నుంచి ముర్ము ప్రచారం మొదలుపెడుతారని.. ఇప్పటికే పలువురు నాయకుల మద్దతు కోరారని.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు అడిగారని జీవీఎల్ అన్నారు.
ద్రౌపతి ముర్ము అభ్యర్థిత్వంతో ఇతర పార్టీలు సైతం ఆలోచనల్లో పడ్డాయని..బీజేపీ ఉన్నతమైన ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి కానున్న మహిళపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇలా కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికారు. ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. రాంగోపాల్ వర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దక్షిణాది రాష్ట్రాలతో సహా దేశం మొత్తం ద్రౌపతి ముర్ము అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటున్నారని.. తెలుగు వాళ్లు ఉంటే అందరూ సంతోషించే వాళ్లు కానీ ఇప్పుడు ఎవరూ ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పెరిగిందని.. ఇప్పటికే 55 శాతం మాకు ఓటింగ్ వచ్చేలా ఉందని..75 శాతానికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర లేనది ఆయన అన్నారు. గుజరాత్ 2002 లో జరిగిన అల్లర్లపై సుప్రీం కోర్ట్ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది.. రాజకీయంగా చేసిన కుట్రను కోర్టులు తిప్పి కొట్టాయని అన్నారు. గుజరాత్ అల్లర్లలో మోదీకి ఎటువంటి సంబంధం లేదని..20 ఏళ్లుగా కోర్టులను మోదీ గౌరవించారని, ఇప్పుడు ఈడీ రమ్మంటే కాంగ్రెస్ వాళ్లు రోడ్లు ఎక్కుతున్నారని విమర్శలు చేశారు.