Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

  • దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం..?
  • పెంపుపై ప్రభుత్వ వర్గాల సమాలోచన..
  • పెంచాలా వద్దా అనే దానిపై వారం లోపు నిర్ణయం..
Petroldieselprice

Petroldieselprice

Petrol-Diesel prices: దేశవ్యాప్తంగా ప్రజలకు షాక్ ఇచ్చేలా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, త్వరలోనే ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్-డీజిల్‌పై లీటరుకు రూ. 4-5 వరకు పెరుగొచ్చని తెలుస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పెట్రోల్-డీజిల్ రేట్లు పెరిగినట్లు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్నప్పటికీ 2022 నుంచి వీటి రేట్లు మారకుండా ఉన్నాయి.

Read Also: UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..

ఇదే సమయంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ. 40-50 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెంపుపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నాయి. ధరలు పెంచాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం వారం రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా పరిణామాలు ఇంధన సంక్షోభాన్ని తీసుకువచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఇటీవల పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఆర్థిక భారం పెరిగింది. దీంతో ధరలు పెంచడమే మార్గమని అవి భావిస్తున్నాయి.